Watch Ysrcp mp Varaprasad Speech in Lok Sabha over Budget and ap Demands
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి జరిగిన చర్చకు సమాధానం ఇస్తారని, వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ కోరారు. వెంటనే టీడీపీ సభ్యులు తమ ఆందోళన విరమించి తమ స్థానాలకు వెళ్లారు. అయితే వైఎస్సార్‌సీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగిస్తుండగా స్పీకర్ వారించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఇచ్చిన హామీలను బడ్జెట్ సమావేశాల్లోపు అమలు చేయాలని పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి. విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి కోరారు.