Surprise Me!

Tamannaah Neglects Kalyan Ram For Vikram

2018-02-12 548 Dailymotion

Tamannaah Bhatia working for two movies in Tollywood. She pairing with Kalyan Ram. Reports suggest that, Tamannaah is behaving like unprofessional manner. So The movie got delayed in finishing.

బాలీవుడ్‌లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా‌కు టాలీవుడ్‌లో సక్సెస్ లేక చాలా రోజులే అవుతున్నది. ప్రస్తుతం టాలీవుడ్‌లో తమన్నాకు హిట్ కంపల్సరీగా మారింది. ప్రస్తుతం క్వీన్ రీమేక్‌తోపాటు కల్యాణ్ రామ్‌తో నా నువ్వే అనే సినిమా చేస్తున్నది తమన్నా. అయితే ఈ రెండు సినిమాల విషయంలో తమన్నాను కొన్ని వివాదాలు చుట్టుమట్టాయనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.
హిందీలో విజయం సాధించిన క్వీన్ దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ రీమేక్ అవుతున్నది. కంగనా రనౌత్ మెప్పించిన పాత్రను తెలుగులో తమన్నా పోషిస్తున్నది. అయితే ఆ చిత్ర దర్శకుడికి తమన్నాకు మధ్య ఏదో కోల్డ్‌వార్ నడుస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి.
క్వీన్ వివాదంపై క్లారిటీ రాకముందే తమన్నాను మరో వివాదాస్పద అంశం చుట్టుముట్టింది. కల్యాణ్ రామ్‌తో కలిసి నటిస్తున్న నా నువ్వే సినిమా షూటింగ్‌కు సరిగా హాజరుకాకపోవడం వలన ప్రాజెక్ట్ లేటు అవుతున్నట్టు సమాచారం. తమన్నా వ్యవహారమే సినిమా రిలీజ్‌కు ఆలస్యమనే అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నా నువ్వే చిత్రానికి పీసీ శ్రీరాం లాంటి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వర్క్ పనిచేస్తున్నారు. అయితే తమన్నా సెట్‌కు ఎప్పుడొస్తుందో అని వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదట. తమన్నా ప్రొఫెషనల్‌గా వ్యవహరించడం లేదని చిత్ర యూనిట్ మండిపడుతున్నదట.
నా నువ్వే సినిమా ప్రమోషన్‌ను పక్కన పెట్టి విక్రమ్‌తో కలిసి నటించిన స్కెచ్ సినిమా ప్రమోషన్‌లో తమన్నా బిజీగా మారిందట. దాంతో నా నువ్వే షూటింగ్‌కు ఇబ్బందికరంగా మారిందనే యూనిట్ సభ్యులు చెప్పుకొంటున్నారు.