Surprise Me!

Third Front : Chandrababu ally with Mamata Banerje

2018-03-07 1,723 Dailymotion

AP Chief Minister Chandrababu Naidu may prefer to allay with West Bengal Chief Minister Mamata Banerjee’s Third Front rather than with TS CM K. Chandrasekhar Rao's Third Front.
బిజెపితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు తెగదెంపులు చేసుకుంటారనే ప్రచారం ముమ్మరమైంది. ఈ స్థితిలో ఆయన జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించడానికి కూడా సిద్దపడినట్లు సమాచారం. ఇప్పటికే థర్డ్ ఫ్రంట్ తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఎటు వైపు ఉంటారనే చర్చ సాగుతోంది. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్ వైపు ఉంటారా, మమతా బెనర్జీ వైపు ఉంటారా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది.

కేసిఆర్ ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్, మమతా బెనర్జీ తలపెట్టిన థర్డ్ ఫ్రంట్ ఒక్కటేనా, కాదా అనే సందిగ్దత నెలకొని ఉంది. ఈ స్థితిలో చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ వైపు ఉండదలుచుకుంటే ఎవరి వైపు ఉంటారనేది ప్రశ్న. ఆయన కేసీఆర్ వైపు కాకుండా మమతా బెనర్జీ వైపు ఉంటారని అంటున్నారు. దానికి కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

థర్డ్ ఫ్రంట్ ఆలోచనపై పలువురు నాయకులు ప్రతిస్పందిస్తున్నారు. అయితే, ఈ విషయంపై చంద్రబాబు ఇప్పటి వరకు ఏమ మాట్లాడలేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తూ, భవిష్యత్తులో అనుసరించాల్సిన వైఖరిపై సమాలోచనలు జరుపుతూ ఆయన బిజీగా ఉన్నారు. కాగా, థర్డ్ ఫ్రంట్‌పై చంద్రబాబుతో మాట్లాడారా అని అడిగితే ఇంకా లేదని కేసీఆర్ చెప్పారు.