Mercury movie Twitter review. karthik Subbaraj is the director for this silent film
ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మెర్క్యురీ. సైలెంట్ మూవీగా వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన సన్నివేశాలతో థ్రిల్ చేయడం ఖాయం అంటూ ప్రచారం పొందుతోంది. ఈ చిత్ర ప్రచార చిత్రాలు కూడా అలాగే ఉన్నాయి కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ ప్రయోగాత్మక చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. దీనితో రెగ్యులర్ సినిమాలు చూసి విసిగిపోయిన ఆడియన్స్ కు మెర్కురీ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. యుఎస్ లో ఈ చిత్ర ప్రదర్శన ప్రారంభం అయింది. మెర్క్యురీ చిత్రం అంచనాలు అందుకునే విధంగా ఉందా లేదా ఇప్పుడు చూద్దాం.
మెర్క్యురీ చిత్రానికి యుఎస్ లో అద్భుతమైన స్పందన వస్తోంది. స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి ప్రధాన బలం. ఇటువంటి ప్రయోగాత్మక చిత్రాన్ని ఎంచుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు అభినందనలు.
చిత్రం స్లోగా పిక్ అప్ అవుతుంది. మంచి థ్రిల్ మూమెంట్స్ ఉన్నా కొన్ని మాత్రమే ఉన్నాయి. సినిమాట్రోగ్రఫీ చాలా బావుంది.
మెర్క్యురీ చిత్రం డోంట్ బ్రీత్ అనే చిత్రాన్ని పోలివుంది. కార్తీక్ సుబ్బరాజ్ వంటి దర్శకుడు చేయాల్సిన చిత్రం కాదు.
ఫస్ట్ హాఫ్ బాగాలేదు. సెకండ్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి. ప్రభుదేవా అద్భుతంగా నటించారు.
మెర్క్యురీ చిత్రంలో మంచి సందేశం ఉంది. బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఉత్కంఠ రేకెత్తించే విధంగా ఉంది.
మెర్క్యురీ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.