Bharat Ane Nenu movie First review. Cinecritic Umar Sandhu confirms it is blockbuster
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధం అయింది. మహేష్ బాబు ఈ చిత్రంలో పవర్ ఫుల్ సీఎం పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ రాజకీయ నాయకుడిగా నటించడం ఇదే తొలిసారి. భరత్ అనే నేను చిత్ర ట్రైలర్, స్టిల్స్ లో మహేష్ స్టైల్ ఫాన్స్ ని పిచ్చెక్కించే విధంగా ఉంది.
భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతో ఈ చిత్రం తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ అని అన్నాడు. అది అక్షరాలా సత్యం అయిందని ఉమర్ సందు ఆంటున్నాడు. మహేష్ మొత్తం కెరీర్ లో ఈ చిత్రంలో అత్యుత్తమంగా మహేష్ బాబు నటించాడు.
ఎమోషనల్ సన్నివేశంలో మహేష్ బాబు నటన అద్భుతంగా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లో సైతం మహేష్ క్లాస్ లుక్ లో అదరగొట్టాడు. చదువుకున్న వాడిగా, మంచి ముఖ్యమంత్రిగా మహేష్ ఈ చిత్రంలో కనిపిస్తాడు.
బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కైరా అద్వానీ గ్లామర్, మహేష్ తో ఆమె కెమిస్ట్రీ ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచాయి. కైరా అద్వానీ పాత్రకు కూడా చాలా బలంగా ఉంటుంది.
భారత అనే నేను చిత్రానికి మరో ప్రధాన భలం సినిమాటోగ్రఫీ. ఎలివేటింగ్ సన్నివేశలలో మహేష్ ని చూపించిన విధానం అభిమానులని ఆకట్టుకోవడం ఖాయం. ప్రతి ప్రేమ్ రిచ్ గా తీర్చిదిద్దారు.
దర్శకుడు కొరటాల శివ ప్రత్యేకమైన శైలితో కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఆయన హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. మహేష్ తో కొరటాలకు రెండవ చిత్రం ఇది. భరత్ అనే నేను చిత్రంలో కొరటాల ఎక్కువగా కథపైనే దృష్టి పెట్టారు. బలమైన కంటెంట్ తో ప్రేక్షకులని కట్టిపడేసే విధంగా ఆయన దర్శత్వం ఉంది.