NTR,Trivikram Movie Name.After scoring back to back hits consecutively with Temper, Nannaku Prematho, Janatha Garage and Jai Lava Kusa, Young Tiger NTR will be teaming up with ace director Trivikram Srinivas. latest news that the film title locked. official announcement very soon.
#NTR
#Trivikram
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు విడుదల చెయ్యబోతున్నారు. అక్టోబర్ లో రాజమౌళి సినిమాకు ఎన్టీఆర్ వెళ్లాలి కాబట్టి త్రివిక్రమ్ సినిమాను ఫాస్ట్ గా పూర్తి చెయ్యాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానుంది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. తొలిసారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండడంతో నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ సినిమాకు రారా కుమారా టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే టైటిల్ ను రేపు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఒక ట్రైనర్ వద్ద శిక్షణ తీసుకుని మరీ బరువు తగ్గి కొత్త లుక్ ట్రై చెయ్యడం జరిగింది.
అక్టోబర్ లో రాజమౌళి సినిమాకు ఎన్టీఆర్ వెళ్లాలి కాబట్టి త్రివిక్రమ్ సినిమాను ఫాస్ట్ గా పూర్తి చెయ్యాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రానికి రారా కుమారా అనే టైటిల్ సరిగ్గా సెట్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం. అజ్ఞాతవాసి తర్వాత వస్తోన్న సినిమా కావడంతో త్రివిక్రమ్ ఈ సినిమాపై ఫోకస్ పెట్టడం జరిగింది.