Surprise Me!

Officer Movie Almost Closed All Areas, Kaala Effect On Box Office

2018-06-07 1 Dailymotion

Officer movie almost closed in all areas. Kaala effect on boxoffice

రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ఆఫీసర్ చిత్రం కంచికి చేరింది. అక్కినేని, ఆర్జీవీ అభిమానుల్లో మినహా ఈ చిత్రంపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఫుల్ రన్ లో ఈ చిత్రం కనీసం కోటి కూడా సాధించే పరిస్థితి లేదు.
కింగ్ నాగార్జున కెరీర్ లోనే ఆఫీసర్ చిత్రం అత్యంత చెత్త చిత్రంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈవిషయంలో వర్మ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చెలరేగుతున్న సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా చిత్రం విడుదల కావడంతో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఆఫీసర్ చిత్రాన్ని తొలగించారు. విడుదలై వారం కూడా పూర్తి కాకముందే ఇలాంటి ఆఫీసర్ చిత్రం కనుమరుగవడం గమనార్హం.
కాలా విడుదల ఎఫెక్ట్ కేవలం ఆఫీసర్ చిత్రానికి మాత్రమే కాదు, గత వారం విడుదలైన అభిమన్యుడు చిత్రంపై కూడా పడిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.