Surprise Me!

Men In Blue First Time Bad Record After World Cup 2011

2018-07-16 169 Dailymotion

Team India failed to score a single six in their 86-run loss to England at Lord's. The mark was previously recorded by the Men in Blue back in 2011 World Cup semifinal against Pak.
#eoinmorgan
#england
#india
#cricket
#viratkohli

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే ఒక సిరీస్‌ను చేజిక్కుంచుకుని పైచేయి సాధించగా.. ఇంగ్లాండ్ మరో సారి అవకాశాన్ని జారవిడవకూడదన్నట్లు పోటీపడి ఆడుతోంది. ఇలాంటి హోరాహోరీ పోరులో.. హేమాహేమీ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌ అంటే సాధారణంగానే బౌండరీల మోతను ఆశిస్తారు అభిమానులు. అలాంటిది మ్యాచ్ మొత్తంలో ఒక్క సిక్సు బౌండరీ కూడా లేకుండా మ్యాచ్‌ను ముగించేసింది టీమిండియా.ఇంగ్లాండ్ చేతిలో భారీ తేడాతో ఓటమికి గురైన టీమిండియా... శనివారం లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సేన తన ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్‌ కూడా నమోదు చేయలేకపోయింది. టాస్‌ ఓడిన భారత్‌ మొదట బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఛేదించలేకపోయింది. 86 పరుగుల తేడాతో కోహ్లీ సేన పరాజయం పాలైంది.